How to Start a Business and Achieve Success | వ్యాపారం ఎలా ప్రారంభించాలి
వ్యాపారం ఎలా ప్రారంభించాలి?
"ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు వందసార్లు ఆలోచించండి. కానీ ఒకసారి ప్రారంభించిన తర్వాత మాత్రం మళ్లీ వెనక్కి తిరిగి ఆలోచించకండి. పూర్తి నమ్మకంతో ముందుకు సాగండి."
ఈ రోజుల్లో చాలామంది కష్టపడకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఒక ఫోన్ తీసుకుని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టితే చాలు, అదే బిజినెస్ అనుకుంటున్నారు. కానీ నిజమైన వ్యాపారం అంటే అది కాదు.
మొదటి పరీక్ష
నువ్వు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే, ముందుగా భగవంతునిపై భక్తిని పెంచుకో. "దీనికి వ్యాపారానికి సంబంధం ఏమిటి?" అని అనిపించవచ్చు. కానీ ఇదే నీ మొదటి పరీక్ష.
వ్యాపారం ప్రారంభించే ముందు 21 రోజుల ఛాలెంజ్ తీసుకో.
ప్రతి రోజు ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య లేవాలి.
భగవంతుని ప్రార్థించాలి.
ఒక్కరోజు కూడా మిస్ కాకూడదు.
ఈ 21 రోజులు క్రమశిక్షణగా పూర్తి చేయగలిగితే, నువ్వు వ్యాపారం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్టే.
వ్యాపారం ప్రారంభించిన తర్వాత జీవితాంతం ఒక విషయం గుర్తుంచుకో.
ఎంత పెద్ద విజయాన్ని సాధించినా, నీ ఉదయపు ఆధ్యాత్మిక అలవాటును మాత్రం ఎప్పటికీ వదలకూడదు.
భక్తి వల్ల లాభం ఏమిటి?
"దీనివల్ల నాకు ఏమి లాభం?" అని ఆలోచించకు.
వ్యాపారంలో సమస్యలు రావడం సహజం. కానీ భక్తి, ప్రశాంతమైన మనసు, క్రమశిక్షణ ఉన్నవారు ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలరు.
ఈ రోజుల్లో అవకాశాలు అపారంగా ఉన్నాయి
ముకేష్ అంబానీ ఒకసారి చెప్పిన మాట:
"మా నాన్నగారికి వ్యాపారంలో విజయం సాధించడానికి 50 సంవత్సరాలు పట్టింది. నాకు 25 సంవత్సరాలు పట్టింది. నా పిల్లలు ఇంకా తక్కువ సమయంలోనే సాధించగలుగుతున్నారు."
ఈ రోజుల్లో ప్రపంచం మొత్తం ఒక నెట్‌వర్క్‌గా మారింది.
నీ దగ్గర ఒక మంచి Business Idea ఉంటే...
పెట్టుబడి పెట్టడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు.
నీతో పనిచేయడానికి మంచి వ్యక్తులు దొరుకుతారు.
అవకాశాలకు కొరత లేదు.
కాబట్టి నీలో సామర్థ్యం ఉంటే, ఈ కాలం వ్యాపారం ప్రారంభించడానికి అత్యుత్తమ సమయం.
SUCCESS Formula
వ్యాపారం ప్రారంభించే ముందు ఈ 7 అంశాల్లో నువ్వు ఎంత బలంగా ఉన్నావో పరిశీలించు.
S – Self Discipline (స్వీయ క్రమశిక్షణ)
U – Understanding Market & Strategy (మార్కెట్ అవగాహన మరియు వ్యూహం)
C – Culture (సంస్థ సంస్కృతి)
C – Cash Flow (నగదు ప్రవాహం)
E – Emotional Storytelling (భావోద్వేగ అనుసంధానం)
S – Systems, Data & AI (వ్యవస్థలు, డేటా మరియు AI)
S – Sales & Skills (అమ్మకాలు మరియు నైపుణ్యాలు)
1. Self Discipline
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, అనవసర వీడియోలకు దూరంగా ఉండు.
వ్యాయామం చేయి.
ధ్యానం చేయి.
శరీరాన్ని, మనసును బలంగా తయారు చేసుకో.
దీనికోసం KRISHNA Rule ను అనుసరించు.
KRISHNA అంటే
K – Knowledge (జ్ఞానం)
R – Relationships (సంబంధాలు)
I – Investments (పెట్టుబడులు)
S – Spirituality (ఆధ్యాత్మికత)
H – Healthy Habits (మంచి అలవాట్లు)
N – No – అవసరం లేని వాటికి "కాదు" చెప్పడం
A – Active Pulse – మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం
2. Knowledge
ప్రతి రోజు కనీసం 20 నిమిషాలు పుస్తకాలు చదవాలి.
సాధ్యమైతే రోజుకు ఒక గంట చదివే అలవాటు చేసుకో.
చదవడం ఆపేస్తే, ఎదుగుదల కూడా ఆగిపోతుంది.
3. Relationships
నీకు కనీసం 30 మంది మంచి పరిచయాలు ఉండాలి.
LinkedIn వంటి ప్లాట్‌ఫారమ్‌లలో మంచి వ్యక్తులతో కనెక్ట్ అవ్వు.
డబ్బు అడగకు.
బదులుగా ఇలా అడుగు:
"నా దగ్గర ఒక మంచి Business Idea ఉంది. దయచేసి నాకు మార్గదర్శనం చేయండి."
చాలామంది నిజాయితీగా అడిగితే సహాయం చేస్తారు.
4. Investments
పాఠశాలలో మనకు డబ్బు గురించి ఎక్కువగా నేర్పరు.
Loan అంటే ఏమిటి?
Asset అంటే ఏమిటి?
Investment అంటే ఏమిటి?
ఇవి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.
అవసరమైనంత మాత్రమే ఖర్చు చేయి.
ప్రతి నెల Mutual Funds వంటి మంచి పెట్టుబడులు ప్రారంభించు.
ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని దానం చేయి.
వ్యాపారం అంటే చివరికి Cash Flow.
రోజుకు ఎంత డబ్బు నీ వ్యాపారం సంపాదిస్తోంది అనేదే ముఖ్యమైన విషయం.
5. Spirituality & Healthy Habits
విజయం సాధించిన ప్రతి వ్యాపారవేత్తకు కొన్ని స్థిరమైన అలవాట్లు ఉంటాయి.
ఉదయాన్నే లేవడం
ప్రార్థన
వ్యాయామం
రోజు ప్రణాళిక
సమయపాలన
చాలామంది Gratitude Journal నిర్వహిస్తూ ప్రతిరోజూ తమ లక్ష్యాలు, పనులు, కృతజ్ఞతలను రాస్తారు.
మంచి అలవాట్లు ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోవచ్చు.
5 AM Club
ఉదయం 5 గంటలకు లేవడం వల్ల
ధ్యానం చేయడానికి
వ్యాయామం చేయడానికి
రోజు ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి
ప్రశాంతంగా ఆలోచించడానికి సమయం దొరుకుతుంది.
సమయం లేదని చెప్పేవారు గంటల తరబడి సోషల్ మీడియా చూస్తూ ఉంటారు.
అది నీ జీవితాన్ని మార్చదు.
Mobile ను సరిగ్గా ఉపయోగించు
అన్నం తినేటప్పుడు
ఫోన్ వద్దు.
టీవీ వద్దు.
మొబైల్ Calendar లో నీ పనులు రాసుకో.
Brain మీద అనవసరమైన భారం వేయకు.
ప్రశాంతమైన మనసు ఎక్కువ అవకాశాలను గుర్తిస్తుంది.
6. Learn to Say No
అన్నింటిలో Expert అవ్వడం సాధ్యం కాదు.
నీకు బాగా నచ్చిన ఒక రంగాన్ని ఎంచుకో.
దానిలో లోతుగా నేర్చుకో.
మిగతా వాటికి అవసరమైతే "No" చెప్పడం నేర్చుకో.
7. Active Pulse
ప్రస్తుతం మార్కెట్లో ఏమి ట్రెండ్ అవుతోంది?
కస్టమర్‌కు ఏమి కావాలి?
ఎక్కడ అవకాశాలు ఉన్నాయి?
వాటిని ఎప్పటికప్పుడు గమనించు.
ముగింపు
ఏ పని ప్రారంభించినా చిత్తశుద్ధితో ప్రారంభించు.
భగవంతునిపై విశ్వాసం ఉంచు.
కష్టపడి పని చేయి.
కొంచెం డబ్బు వచ్చిన వెంటనే అహంకారం పెంచుకోకు.
విజయం వచ్చినా వినయంగా ఉండు.
ఇందులో ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే "Business" అని కామెంట్ చేయండి.
ఇట్లు,
శ్రీకృష్ణుడిని నమ్ముకున్న శివుడు
Shiv Yadav
Comments
Post a Comment