Law of Attraction- ఒక్కసారి నమ్మి చూడు
ఆకర్షణ సిద్ధాంతం (Law of Attraction) అంటే ఏమిటి? ఇది నిజంగా పనిచేస్తుందా?
"మన ఆలోచనలే మనల్ని మన గమ్యానికి చేరుస్తాయి" అని ఎవరైనా చెబితే నమ్మడం కొంచెం కష్టమే. "ఇన్ని రోజులు మనం పడ్డ కష్టం మనల్ని ఏ రకంగా బాగు చేసింది? ఒక్కసారి ఈ సిద్ధాంతాన్ని కూడా ప్రయత్నించి చూస్తే పోలా!" అని చాలా మంది అనుకుంటారు.
ఈ రోజు మనం ఆకర్షణ సిద్ధాంతం (Law of Attraction) ద్వారా:
- ఒక సాధారణ ఫుడ్ డెలివరీ బాయ్ (Food delivery boy) తన జీతాన్ని ఎలా డబుల్ చేసుకోగలిగాడు?
- బ్యాంకర్లు తమ పనితీరును (Performance) ఎలా రెట్టింపు చేసుకోగలిగారు?
- క్రీడాకారులు (Sports persons) ఈ టెక్నిక్ ఉపయోగించి చాలా తక్కువ సమయంలోనే అద్భుతమైన కమ్‌బ్యాక్ (Come back) ఎలా ఇవ్వగలుగుతున్నారు? అనే విషయాలను తెలుసుకుందాం.
చాలా మంది అసలు ఈ Law of Attraction అనేది పనిచేయదని, ఇదంతా ట్రాష్ (Trace/Trash) అని నమ్మరు. కానీ వారిని ఒక్కటే ప్రశ్న అడగాలి—"ఇప్పటి వరకు చాలా కష్టపడ్డావు కదా, మరి ఏం సాధించావు?". అందుకే నిన్ను నువ్వు నమ్మి ఒక్కసారి దీన్ని ప్రయత్నించి చూడు.
Law of Attraction అనేది నిజమా?
దీనికి సమాధానం: అవును, నిజమే. దీని గురించి వేల పుస్తకాలు, లక్షల వీడియోలు ఉన్నాయి. కోట్ల మంది ప్రజలు ఇది నిజంగా జరుగుతుందని చెబుతున్నారు. ఇది నిజమో కాదో తెలియాలంటే ఒక్కసారి నువ్వే చేసి చూడు.
Law of Attraction చెప్పేది ఒక్కటే, అది కూడా చాలా చిన్న విషయాలు:
- ఎల్లప్పుడూ సంతోషంగా (Happy) ఉండు.
- మంచిగా ఆలోచించు.
- ఎవరి గురించి చెడుగా ఆలోచించకు.
- ఏ పని చేసినా ఆనందంగా చెయ్యి.
ఇది వినగానే చాలా మంది తప్పుగా అనుకుంటారు—"కేవలం ఆలోచిస్తేనే పనులు అయిపోతాయా?" అని. కానీ దీనికి ఒక పద్ధతి (Process) ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉన్నారు:
- "నేను ఆలోచిస్తున్నాను కాబట్టి అన్నీ అయిపోతాయి" అనుకునేవారు.
- "నేను రాత్రింబగళ్లు కష్టపడుతున్నాను కానీ ఫలితం లేదు" అనేవారు.
కానీ ఎప్పుడైతే ఈ రెండింటినీ కలిపి చేస్తారో, అప్పుడే అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
"మంచిగా ఆలోచించు + మనస్ఫూర్తిగా కష్టపడు = అనుకున్న అద్భుత ఫలితాలు లభిస్తాయి"
కేవలం కష్టపడితేనే అన్నీ అయిపోతాయి అనుకుంటే, సమాజంలో నీకన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వారందరికీ ఆశించిన ఫలితం ఎందుకు దక్కడం లేదు? అలాగే కేవలం ఆలోచిస్తేనే అన్నీ జరుగుతాయి అనుకుంటే, బాగా ఆలోచించే వారికి ఎందుకు ఫలితాలు రావడం లేదు? కాబట్టి Law of Attraction పనిచేస్తుందా లేదా అని ఇతరులతో వాదించడం మానేసి, ఈ రెండింటి మీద వర్కవుట్ చేసి చూడు.
ప్రపంచంలోని మల్టీ బిలియనీర్లు Law of Attraction నమ్ముతారా?
ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే, ప్రపంచం ఎప్పుడూ గెలిచినోడి మాట మాత్రమే వింటుంది కాబట్టి. దీనికి సమాధానం—అవును, ప్రపంచంలో ఉన్న మల్టీ బిలియనీర్లు (Multi-Billionaires) అందరూ ఈ Law of Attractionను చాలా గట్టిగా నమ్ముతారు. వారిలోనే కాదు, ఎంతో మంది విజయవంతమైన వ్యక్తులు (Successful people) దీన్ని విశ్వసిస్తారు.
- ఉదాహరణ 1 (గుకేష్ దొమ్మరాజు): ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ (Gukesh Dommaraju) గెలవగానే ఒక వీడియో బాగా వైరల్ అయింది. అందులో తను "నేను వరల్డ్ ఛాంపియన్ కావాలని ముందే విజువలైజేషన్ (Visualization) చేశాను" అని చెప్పాడు.
- ఉదాహరణ 2 (డిస్నీ - Walt Disney): డిస్నీ వరల్డ్ ప్రారంభం కాకముందే వాల్ట్ డిస్నీ మరణించారు. దాని ప్రారంభోత్సవం రోజు అతని సోదరుడు ఒక మాట చెప్పాడు—"అందరూ ఈ రోజు డిస్నీ వరల్డ్‌ను చూస్తున్నారు, కానీ వాల్ట్ డిస్నీ దీన్ని ఎప్పుడో (తమ మనసులో) చూసేశాడు. అందుకే ఈ రోజు మనం అందరం ఇక్కడ ఉన్నాం". దీనినే మేనిఫెస్టేషన్ (Manifestation) అంటారు.
మేనిఫెస్టేషన్ (Manifestation) అంటే ఏమిటి?
భవిష్యత్తులో జరగవలసిన దాన్ని, ఇప్పటికే జరిగిపోయింది అని బలంగా అనుకోవడం. "నువ్వు ఆ పనిని ఖచ్చితంగా చెయ్యగలవు" అని నిన్ను నువ్వు నమ్మాలి.
- నువ్వు అనుకుంటూ ఉండు, అనుకున్నది చేస్తూ ఉండు.
- అది ఎలా సాధ్యం అవుతుంది అని ఎక్కువగా ఆలోచించకు.
- నీ నమ్మకాన్ని 100% పెట్టు, అందులో 1% కూడా అనుమానానికి (Doubt) తావు ఇవ్వకు.
"నేను చేయగలనా లేదా?" అని ఆలోచించడం కన్నా—"నేను చేసేశాను" అని ఆలోచించి ప్రశాంతంగా నీ పని చేసుకో.
Believe on 4D → Feel, Think, Believe, Act.
నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని నీకు నచ్చినట్టుగా ఊహించుకో. నీకు ఏమి కావాలి అనుకుంటున్నావో అది ఒక పేపర్ మీద రాసుకొని, అది నిజంగా జరిగిపోయినట్టు సంతోషంగా ఫీల్ అవ్వు. ఒక్కసారి నువ్వు అనుకున్నది సాధించావో... ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.
నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని నీకు నచ్చినట్టుగా ఊహించుకో. నీకు ఏమి కావాలి అనుకుంటున్నావో అది ఒక పేపర్ మీద రాసుకొని, అది నిజంగా జరిగిపోయినట్టు సంతోషంగా ఫీల్ అవ్వు. ఒక్కసారి నువ్వు అనుకున్నది సాధించావో... ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.
సరళంగా చెప్పాలంటే, దేవుడిని మనం ఏది కోరుకుంటామో... వాటన్నింటినీ Law of Attraction ద్వారా మనం పొందవచ్చు. ప్రతిరోజూ ఒక నిర్దిష్టమైన సమయాన్ని (Daily routine time) కేటాయించుకొని, రోజు అదే సమయానికి నువ్వు అనుకున్నవన్నీ జరిగినట్టు ఊహించుకుంటూ ఆనందంగా గడుపు.
ఒక్కసారి ప్రయత్నించి చూడు (Just Try Once)!
ఇట్లు,
శ్రీకృష్ణుడినే నమ్ముకున్న శివుడు
Shiv Yadav
Comments
Post a Comment