Started With 500 Reached 5000 CR Only with Own Talent and Own Investment
మన "సక్సెస్ స్టోరీస్" సిరీస్‌లో ఈరోజు మనం భారతదేశంలోనే అత్యంత పెద్దదైన డయాగ్నోస్టిక్ సెంటర్‌ను స్థాపించిన ఒక గొప్ప వ్యాపారవేత్త (Entrepreneur) గురించి తెలుసుకుందాం. ఆయనే డాక్టర్ అరోకియాస్వామి వేలుమణి (Dr. Arokiaswamy Velumani).
ఒక చిన్న గ్రామంలో పుట్టి, వేసుకోవడానికి కనీసం చెప్పులు కూడా లేని స్థితి నుండి, మాట్లాడటానికి సరిగ్గా ఇంగ్లీష్ రాకపోయినా... ఈరోజు దేశంలోనే నంబర్ వన్ బ్రాండ్‌గా ఎదిగిన "Thyrocare" ను ఆయన ఎలా స్థాపించారో ఈ బ్లాగ్‌లో చూద్దాం.
⚡ జీవితంలో గెలుపు అంటే ఏమిటి? (The Delta of Success)
డాక్టర్ వేలుమణి గారు విజయాన్ని ఒక సాధారణ సమీకరణంతో చెప్తారు:
Success in life is Delta = X2-X1
- X2 = ఈరోజు నేను ఉన్న స్థానం
- X1 = నేను ఎక్కడి నుండి మొదలయ్యాను (అంటే "0" - శూన్యం)
ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తారు: "నేను సున్నా (Zero) నుండి నా ప్రయాణాన్ని ప్రారంభించాను. అందుకే నిర్ణయాలు చాలా ధైర్యంగా తీసుకునేవాడిని. పేదరికం అనేది మీకు ఎలాంటి భయం లేకుండా గట్టి నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది (Poverty gives you power to take decisions)". చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలు, సమస్యలు చూశారు కాబట్టి, పెద్దయ్యాక సమస్యలను పరిష్కరించడం ఆయనకు కష్టం అనిపించలేదు. మీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మీరు ధైర్యంగా జీవితాన్ని సాగిస్తే, మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు!
ఉద్యోగం నుండి ₹5,000 కోట్ల బిజినెస్ వైపు..
వేలుమణి గారు ఒక పేద కుటుంబంలో జన్మించారు. పేదరికం, చిన్న గ్రామం అనే కాంబినేషన్ చాలా డేంజర్. కానీ దానివల్లే ఆయనలో ఎలాగైనా ఎదగాలనే కసి, పట్టుదల పెరిగాయి. కోయంబత్తూర్‌లో డిగ్రీ పూర్తి చేశాక, ముంబైలోని ప్రముఖ BARC (Bhabha Atomic Research Centre) లో ఉద్యోగం వచ్చింది.
కేవలం ₹500 జేబులో పెట్టుకుని ముంబై రైల్వే స్టేషన్ (VT Station) లో దిగారు. అక్కడ తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో దాదాపు 3 నెలలు ఆ స్టేషన్‌లోనే గడిపారు. ఉద్యోగం చేస్తూనే పెళ్లి చేసుకున్నారు, MSc మరియు PhD కూడా పూర్తి చేశారు. అంతా బాగుంది అనుకున్న సమయంలో, ఒక సరికొత్త ఆలోచనతో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కేవలం ₹2 లక్షల సొంత పెట్టుబడితో "Thyrocare" అనే బ్రాండ్‌ను ప్రారంభించారు.
థైరోకేర్ సక్సెస్ వెనుక ఉన్న బిజినెస్ సీక్రెట్స్
డాక్టర్ వేలుమణి గారు వ్యాపారంలో మూడు ముఖ్యమైన కాన్సెప్ట్‌లను ఉపయోగించారు:
- ది పవర్ ఆఫ్ వాల్యూమ్ (Volume): అప్పట్లో యూరప్ నుండి థైరోయిడ్ కిట్లను ₹150 కి ఇంపోర్ట్ చేసుకునేవారు. కానీ వేలుమణి గారు దానిని సొంతంగా కేవలం ₹30 కే తయారు చేశారు. రేటు చాలా తక్కువ (₹30) పెట్టడం వల్ల కస్టమర్లు పెరిగి, రోజుకు దాదాపు 2 లక్షల టెస్టులు జరిగేవి.
- ఉబెర్ కాన్సెప్ట్ (Uber Concept): ల్యాబ్‌లోని మెషీన్లు రోజులో 24 గంటలూ రన్ అయ్యేలా ప్లాన్ చేశారు.
- మెక్‌డొనాల్డ్స్ కాన్సెప్ట్ (McDonald's Concept): ఆయన థైరోయిడ్, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల (Disorder Diseases) పరీక్షలను ఎంచుకున్నారు. ఎందుకంటే వీటికి ఒకసారి పేషెంట్ వస్తే, జీవితాంతం రెగ్యులర్‌గా వస్తూనే ఉంటారు.
- అమెజాన్ టెక్నిక్ (Amazon Technique): పేషెంట్ ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్లి బ్లడ్ శాంపిల్స్ సేకరించడం. దీని ద్వారా 40% మార్జిన్‌తో భారీగా సంపాదించారు.
ఆయన బిజినెస్ సూత్రం ఒక్కటే:
"ధరను తక్కువగా ఉంచడం, ఖర్చులను అదుపులో పెట్టుకోవడం (Keeping price low, controlling the cost)". ఆయన ఎవరి దగ్గరా అప్పు తీసుకోలేదు, ఎవరి ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టించుకోలేదు.
25,000 మంది ఫ్రెషర్లను ఎందుకు హైర్ చేసుకున్నారు?
డిగ్రీ పూర్తి కాగానే వేలుమణి గారు ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్లారు, కానీ ప్రతిచోటా "ఎక్స్‌పీరియన్స్ ఉందా?" అనే ప్రశ్నే ఎదురైంది. అప్పుడే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు – తాను పెట్టబోయే కంపెనీలో కేవలం ఫ్రెషర్లను మాత్రమే తీసుకోవాలని. అలా దాదాపు 25,000 మంది ఫ్రెషర్లను చేరదీశారు.
వారిలో డిసిప్లిన్, ఫోకస్, ఇంటెలిజెన్స్ చూసి కేవలం బెస్ట్ అయిన 2,500 మందిని ఉంచుకుని మిగతా వారిని ఫిల్టర్ చేశారు. ఆయన నమ్మకం ప్రకారం: "వేరేవాళ్లు ట్రైన్ చేసిన వాళ్లకన్నా, మనకు మనం సొంతంగా ట్రైన్ చేసిన ఉద్యోగులే 1000 రెట్లు మెరుగైన ఔట్‌పుట్ ఇస్తారు".
₹5,000 కోట్ల ఎగ్జిట్ (Exit) వెనుక బాధాకరమైన కథ
వ్యాపారంలో ఆయనకు వెన్నుముకగా నిలిచింది ఆయన భార్య సుమతి వేలుమణి గారు. ఇద్దరూ కలిసి రాత్రింబగళ్లు కష్టపడ్డారు. అయితే, 2016 లో కంపెనీని స్టాక్ మార్కెట్‌లో లాంచ్ (IPO) చేసే సమయానికి ఆమెకు క్యాన్సర్ సోకింది. కేవలం 100 రోజుల్లోనే ఆమె చనిపోయారు. స్టాక్ మార్కెట్ బెల్ నొక్కేటప్పుడు ఆయన ఒంటరిగానే మిగిలిపోయారు.
భార్య లేని జీవితంలో వ్యాపారం ఎందుకనే ఆలోచన వచ్చింది. సరిగ్గా కోవిడ్ సమయంలో కంపెనీ వ్యాల్యూ బాగా పెరిగింది. కొంచెం బ్రేక్ తీసుకోవాలనే ఉద్దేశంతో, ₹5,000 కోట్ల సింగిల్ చెక్ డీల్‌తో కంపెనీ నుండి పూర్తిగా ఎగ్జిట్ అయ్యారు.
📌 ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు:
- తెగించి ముందుకు దూకు: నీకోసం ఎవరూ రారు, నీకు నువ్వే ఎదగాలి.
- అవకాశాన్ని వదులుకోకు: కొంచెం తెలివిగా ఉండు, వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకో.
- వాల్యూమ్ పవర్ తెలుసుకో: తక్కువ లాభంతో ఎక్కువ మందికి సేవలు అందిస్తే విజయం వరిస్తుంది.
- తప్పుల నుండి నేర్చుకో: తప్పు చేయడంలో తప్పు లేదు, కానీ ఒకే తప్పును మళ్లీ మళ్లీ పునరావృతం చేయకూడదు (Do mistake only once, don't repeat).
- రిస్క్ తీసుకో కానీ జాగ్రత్త: నువ్వు రిస్క్ తీసుకోవచ్చు, కానీ నీ కుటుంబ భవిష్యత్తును రిస్క్‌లో పెట్టకూడదు.
ఇట్లు
శ్రీకృష్ణుణే నమ్ముకున్న శివుడు
Shiv Yadav
Note: Based on public interviews and real-life insights shared by Dr.Velumani.
👍 nice
ReplyDelete